సీఎం కేసీఆర్, రాహుల్ ని బఫూన్ అనడంలో తప్పేమీ లేదు: ఎంపీ కవిత

Update: 2018-12-19 07:47 GMT

సీఎం కేసీఆర్, రాహుల్ ని బఫూన్ అనడంలో తప్పేమీ లేదన్నారు ఎంపీ కవిత. ప్రతిపక్ష నేత పార్లమెంటు నిబంధనలు ఉల్లంఘించి, దేశ ప్రధానిని ఎలా హత్తుకున్నారో దేశ ప్రజలంతా చూశారని తెలిపారు. ఇలా సిల్లీగా ప్రవర్తించేవారినే బఫూనే అంటారని కవిత చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు ఎంపీ కవిత. తమ ఎజెండా దేశ ప్రజల కోసం పనిచేయడమేనని బీజెపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉండే తటస్థ కూటమి ఏర్పాటు కావాలన్నారు. రాహుల్ ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే కూటమిలో టీఆర్ఎస్ లేదని రాహుల్ ని ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకిస్తున్న స్ధానిక‌ పార్టీల జాబితాలోనే తాము ఉన్నామని చెప్పారు. 
 

Similar News