చరిత్ర సృష్టించిన హరీశ్ రావు.. 1.20 లక్షల ఓట్ల మెజారిటీతో

Update: 2018-12-11 10:55 GMT

దేశంలోనే తక్కవ  వయసులోనే డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన ఎమ్మెల్యేగా  ఆపద్ధర్మ మంత్రి  తన్నీరు హరీష్‌ రావు రికార్డు సృష్టించారు. గత 14 ఏళ్లలో సిద్దిపేట స్థానం నుంచి వరుసగా ఆరుసార్లు గెలుపొందారు. తెలంగాణ ఎన్నికల్లో హోరాహోరా పోటీలో టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చరిత్ర సృష్టించాడు. ఎవరు అందుకోలేని ఎత్తులో హరీశ్ రావు చేరుకున్నారు. సిద్ధిపేట నియోజకవర్గం నుండి పోటీచేసిన హరీశ్ రావు వందలు, వేలు కాదు ఏకంగా 1.20.650 ఓట్ల మెజారిటీతో ప్రభంజనం సృష్టించారు. సిద్దిపేట ప్రజలు ఏకపక్షంగా తీర్పును కట్టబెట్టారు. దింతో గతంలో మరెవరికి సాధ్యం దేశంలోనే చరిత్ర సృష్టించారు హరీష్‌ రావు. తాజా విజయంతో హరీశ్ రావు ఆ రికార్డులు అన్నింటిని తిరగరాశారు. హరీశ్ విజయంతో సిద్ధిపేట ప్రజలు సంబరాల్లో మునిగితెలుతున్నారు. 

Similar News