‘కారు’లో ఆ ఐదుగురే కూర్చున్నారు‌!.:రణ్‌దీప్‌ సూర్జేవాలా

Update: 2018-11-24 14:54 GMT

అరవై ఏళ్ల పోరాటం అమరుల త్యాగాల ఫలితం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ఎన్నో ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రం. నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన లక్ష్యంగా పోరుబాట పట్టిన తెలంగాణ ప్రజలు కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా మార్చిన ఘనత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుదే అని కాంగ్రెస్ నేత రణ్ దీప్ సూర్జీవాలా ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పాలనపై నేడు గాంధీ భవన్ కాంగ్రెస్ నేతల సమక్షంలో చార్జీషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సూర్జీవాలా మాట్లాడుతూ పోలీసు వాహనాల టెండ్లర్లలో రూ. 3వేల కోట్ల అవినీతి జరిగిందని తీవ్రస్థాయిలో ధ్వజమేత్తారు. మిషన్ భగిరధ పనుల్లో చాలా అవినితి చోటుచేసుకుందని తెలిపారు. కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్ట్ రీడిజైన్ చేశారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ కారులో కేసీఆర్ కుటుంబానికి చెందిన ఐదుగురు మాత్రమే ఉన్నారని, టీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నారు. 

Similar News