ఖైరతాబాద్‌ గణేషుడికి ఉగ్ర ముప్పు?

Update: 2017-12-13 09:57 GMT

గండాల నుంచి గట్టెక్కించే గణనాథుడి చుట్టూ ఉగ్ర గండం పొంచి ఉందా? సర్వ విఘ్నాలకు ఆది దేవుడైన వినాయకుడికి కొత్తగా ఇదేమీ గండం? ఖైరతాబాద్‌ వినాయకుడిని ఆసక్తిగా చూసే ప్రపంచానికి దానికి ఉగ్రవాదులు ముప్పు పొంచి ఉందన్న చేదు వార్తలు కలవరపెడుతున్నాయ్. భారీ గణనాథుడిగా విశేష పూజలందుకునే ఖైరతాబాద్‌ విఘ్నేశ్వరుడికి ఉగ్ర ముప్పు ఉందన్న ప్రచారంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.

 వినాయక చవితి వస్తుందంటే చాలు అందరి చూపు ఖైరతాబాద్ వైపే. గణనాధుడు ఈసారి ఏ రూపంలో కనువిందు చేస్తాడు? ఎన్ని అడుగుల ఎత్తులో కొలువుదీరుతాడని అంతా ఆతృతగా ఎదురుచూస్తారు. అలా అందరూ ఆశ్చర్యపోయే రీతిలో అలరించనున్న లంబోదరుడికి ఉగ్రముప్పు పొంచి ఉందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. నవరాత్రి ఉత్సవాలల్లో అల్లకల్లోలం  సృష్టించేలా  ఉగ్రవాదులు  స్కేచ్‌ చేస్తున్నట్లు  కేంద్ర నిఘా హెచ్చరికలు జారీ చేసింది. 

 విఘ్నాలు తొలగించే వినాయకుడి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో సిటీ  పోలీసులు  అలర్ట్‌ అయ్యారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా  ఖైరాతాబాద్‌ గణేష్‌కకి భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. నవరాత్రి  ఉత్సవాల్లో  విధ్వంసం సృష్టించే అవకాశం ఉండటంతో రెండ్రోజులు ముందే  పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు.  

 గణనాధుడి దర్శించుకునేందుకు లక్షలాది  భక్తులు తరలిరానున్నడంతో  మూడంచెల భద్రతా విధానాన్ని అమలు చేయనున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు  జరగకుండా ఇంటింటి సర్వేను  చేపట్టారు.  ఖైరాతాబాద్‌ రైల్వే గేట్‌ నుంచి  టెలిఫోన్‌ భవన్‌ వరకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.  24 గంటలు భద్రతను పర్యవేక్షించేందుకు  అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. 

 ఇప్పటికే నైజిరియన్ల అలజడి మొదలుకావడంతో  పోలీసులు ఖైరతాబాద్‌ ఏరియాలో డేగ కన్నేశారు.  అనుమానితులను విచారిస్తున్నారు.   నాలుగైదు రోజుల్లో ఎవరైనా అద్దెకు దిగేందుకు వస్తే వివరాలు తెలియజేయాలని స్థానికులకు సూచించారు.  ఉత్సవాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దగ్గరలో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేయడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు  పోలీసులు.

Similar News