మంత్రి కారును త‌రిమికొట్టారు..

Update: 2018-12-07 11:24 GMT

తమిళనాడు నాగపట్నంలో మంత్రి ఓఎస్ మ‌ణియ‌న్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇటివల గజా తుఫాను వల్ల త్రీవంగా నష్టపోయిన ప్రభావిత ప్రాంతాల ప్రజలను పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రి ఓఎస్ వెళ్లారు. అయితే అదే సమయంలో కొంత మంది మంత్రి కారును చుట్టుముట్టి మధ్యలోనే కారును అడ్డుకున్నారు. మంత్రి హత్య చేయడానికేయో కాని ఏకంగా చేతిలో కొడవలి పట్టుకొని దాడికి యత్నించాడు. దింతో డ్రైవర్ కారును వెనక్కి తీసుకెళ్లాడు. ఈ ఘటనలో మంత్రి  ఓఎస్ మ‌ణియ‌న్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగపట్నం జిల్లా, అనేక ఇతర జిల్లాలలో గ‌జ తుఫాను విధ్వంసం సృష్టించింది. గ‌జ తుఫానులో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. నాగపట్నం, తిరువారూర్, తంజావూరు వాసులకు తీవ్రనష్టం వాటిల్లింది.

Similar News