శబరిమల కేసు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ

Update: 2017-12-13 10:07 GMT

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. మహిళల ఆలయ ప్రవేశంపై మొత్తం ఆరు సందేహాలను సుప్రీం ధర్మాసనం లేవనెత్తింది. సంప్రదాయం రాజ్యాంగం కంటే గొప్పదా అని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తరఫు న్యాయవాదులను కోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని గుర్తుచేసింది.

మహారాష్ట్రలోని శని శింగ్నాపూర్ ఆలయ అంతరాలయంలోకి మహిళలను అనుమతించాలంటూ చాలా కాలం ఆందోళన జరిగింది. భూమాత బ్రిగేడ్ న్యాయం పోరాటంలో విజయం సాధించింది. మహిళలను అనుమతించాలని బాంబే కోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు మద్దతు పలికింది. ఆలయ నిర్వాహకులు మొదట మొండికేసినా తర్వాత దారికి వచ్చారు. దీంతో మహిళల కోరిక నెరవేరింది. భూమాత బ్రిగెడ్ తదుపరి లక్ష్యం నాసిక్ త్రయంబకేశ్వరాలయ ప్రవేశం. అయితే ఆలయాల్లో మహిళలను అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది కాబట్టి త్రయంబకేశ్వరాలయంలోనూ ప్రవేశానికి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. 

కేరళ పథనం థిట్ట జిల్లాలోని శబరిమల ఆలయంలో పదేళ్లలోపు, 50 ఏళ్లకు పైబడిన మహిళలకు మాత్రమే అనుమతి. మిగతా వాళ్లకు అనుమతి. దైవ దర్శనం చేసుకోవడానికి తమకున్న హక్కును ఎందుకు అడ్డుకుంటున్నారని మహిళలు చాలా కాలంగా ప్రశ్నిస్తున్నారు. న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. ఆలయ నిర్వాహకులు మాత్రం మహిళలకు ప్రవేశం కల్పించడానికి సుముఖంగా లేరు. ఇది శతాబ్దాలుగా వస్తున్న ఆచారమని వారి వాదన. అయితే సుప్రీం కోర్టు మాత్రం సూటిగా, స్పష్టమైన కారణం చెప్పాలని అడుగుతోంది. శని శింగ్నాపూర్ ఘటన తర్వాత, సుప్రీం కోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు మహిళా ఉద్యమకారుల్లో కొత్త ఆశలు రేపాయి. అయితే, సుప్రీం విచారణను రాజ్యంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేయడంతో సమస్య మళ్లీ మొదటకొచ్చింది. 

Similar News