హైకోర్టు తీర్పు...భావోద్వేగానికి లోనైన కరుణానిధి కుటుంబ సభ్యులు

Update: 2018-08-08 06:46 GMT

కరుణానిధి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ద్రవిడ నేతల సమాధుల పక్కన కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతి నివ్వడంతో కుటుంబ సభ్యులు భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. తమ తండ్రి చివరి కోరిక నెరవేరడంతో కుమారులు స్టాలిన్‌, అళగిరి, కుమార్తె కనుమొళి భావోద్వేగానికి లోనయ్యారు. పార్ధీవ దేహం పక్కనే  కన్నీరు పెట్టుకున్నారు. హైకోర్టు అనుమతిచ్చిన విషయం తెలుసుకుని స్టాలిన్‌కు కళ్లు చెమర్చాయి. దీంతో కిందపడబోతున్న స్టాలిన్‌ను మాజీ టెలికాం శాఖ మంత్రి రాజా పట్టుకున్నారు. 

మెరినా బీచ్‌లో కరుణనిధి అంత్యక్రియలకు హైకోర్టు అనుమతివ్వడంతో రాజాజీ హాల్  పరిసరాల్లో తీవ్ర ఉద్విగ్న వాతావరణం రేగింది. విషయం తెలిసిన వెంటనే పార్టీ కార్యకర్తలు, అభిమానులు కరుణానిధిని కీరిస్తూ నినాదాలు చేశారు. అభిమానుల నినాదాలతో  చుట్టుపక్కల ప్రాంతాలు మార్మోగాయి. దీంతో ఎవరికి తెలియని ఉద్వేగ వాతావరణం ఏర్పడింది.  

Similar News