హిట్లర్ షార్ట్‌కు వేలంలో భలే గిరాకీ!

Update: 2017-09-25 10:51 GMT

న్యూయార్క్: జర్మన్ నాజీ నియంత అడోల్ఫ్ హిట్లర్ అప్పట్లో ఏది చేసినా సంచలనమే. చూసేందుకు పొట్టిగానే కనిపించినా.. కొన్నిదేశాలను గడగడలాడించారాయన. అలాంటి నియంత ఆనాడు ధరించిన బాక్సర్ షార్ట్‌లు కూడా భారీ ధరకు నేడు అమ్ముడుపోయాయి. అమెరికాలో నిర్వహించిన వేలంలో సుమారు రూ.3.60 లక్షలకు రెండు బాక్సర్ షార్టులను దక్కించుకున్నాడో వ్యక్తి. 19 అంగుళాల పొడవు, 39 అంగుళాల నడుం కలిగిన హిట్లర్ షార్ట్‌లను అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్‌లో వేలంలో వేశారు. 1938 ఏప్రిల్ 3-4న స్వదేశానికి వెళుతూవెళుతూ ఆస్ట్రియాలోని పార్క్‌హోటల్ గ్రాజ్‌లో హిట్లర్ దిగారని, అనంతరం ఆ షార్టులను ఆయన బస చేసిన సూట్‌లోనే వదిలేశారని వేలం నిర్వాహకులు తెలిపారు.

Similar News