విశేషమైన సోమావతి అమావాస్య

Update: 2017-12-13 09:49 GMT

శ్రావణమాసంలో సోమవారంతో కూడిన అమావాస్య చాలా విశేషమైంది. ఈ నెల 21వ తేది అమావాస్యరోజు సూర్యగ్రహణం కూడా ఉంది, కాకపోతే మన దేశంలో ఈ గ్రహణం కనపడదని పండితులు చెపుతున్నారు. ఈ నెల 21వ తేదిన సోమావతి అమావాస్యనాడు మహశివుడుని విశేషంగా అభిషేకేంచి పూజించాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.

శ్రావణమాసం సోమవారంతో కూడిన అమావాస్యను సోమావతి అమావాస్య అంటారు. ఉదయం 7.30 నుంచి 9 గంటల మధ్యలో శివాభిషేకం అధిక శుభఫలితాలను అందిస్తుందని శాస్త్రవచనం. అభిషేకానంతరం శివుడికి మందార పుష్పలను సమర్పించే వారికి ఉత్తమమైన సంతానం సిధ్ధిస్తుందని, ఇప్పటికే కలిగిన సంతానానికి మంచి అభివృధ్ధి కలుగుతుందని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. పిల్లల కాపురాలు బాగాలేనివారు సోమావతి అమావాస్య రోజున తెల్లగన్నేరు పూలతో శివుడిని పూజించాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగాలేనివారు పసుపు పచ్చని గన్నేరుపూలతోకాని, తెల్లటి పూలతో కాని పూజించాలి. శ్రావణమాసంలో సోమవారంనాడు వచ్చే అమావాస్య మహాశివరాత్రి కంటే ఉన్నతమైందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని  పండితులు చెపుతున్నారు.

Similar News