తెరుకుచున్న 'శబరిమల' తలుపులు

Update: 2018-11-16 14:31 GMT

మండల పూజల కోసం శబరిమల ఆలయం మరోసారి తెరుచుకుంది. భక్తుల శరణుఘోష మధ్య ప్రధాన అర్చకుడు కందరవు రాజీవరు ఆలయం ద్వారాలను తెరిచారు. ఈ సారి రెండు నెలలకు పైగా స్వామివారు దర్శనమివ్వనున్నారు. మరోవైపు సుప్రీం ఆదేశాలు ఆ తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆలయం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు అయ్యప్పను దర్శించుకునేందుకు భూమాత బ్రిగేడ్‌ సంస్థ అధ్యక్షురాలు తృప్తిదేశాయ్‌ స్వామివారిని దర్శించుకోకుండానే వెనుదిరిగి చూశారు. 
శబరిగిరీశుడు అయ్యప్పస్వామి ఆలయం మండల పూజల నిమిత్తం తెరుచుకుంది. శుక్రవారం సాయంత్రం భక్తకోటి శరణుఘోష మధ్య ప్రధానార్చకుడు కందరపు రాజీవరు ఆలయం ద్వారాలను తెరిచారు. శనివారం నుంచి మకరవిళక్కు వరకు ఆలయం తెరుచుకునే ఉంటుంది. ఈ సమయంలో అయ్యప్ప మాల వేసిన భక్తులు లక్షలాదిగా తరలివచ్చి పదునెట్టంబాడి ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. 

మొత్తం 62 రోజుల పాటు స్వామివారు అభయమివ్వనున్నారు. సంక్రాంతి సమయంలో మకరజ్యోతి దర్శనం తర్వాత ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు. సుప్రీం తీర్పు తర్వాత ఇప్పటివరకు ఆలయ ద్వారాలు మూడు సార్లు తెరుచుకున్నాయి. దీంతో గత రెండు సార్లు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆలయం పరిసరాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. పంబ బేస్‌ క్యాంప్‌ దగ్గర 15 వేల మంది పోలీసులతో పాటు 850 మంది మహిళా పోలీసులను మోహరించారు. ఇటు గురువారం రాత్రి నుంచి 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఇటు అయ్యప్పను దర్శించుకునేందుకు సామాజిక కార్యకర్త తృప్తిదేశాయ్‌ కొచ్చీకి వచ్చారు. విషయం తెలుసుకున్న అయ్యప్ప భక్తులు ఆమెను అక్కడే అడ్డుకున్నారు. దీంతో ఆమె 15 గంటలకు పైగా విమానాశ్రయంలోనే ఉన్నారు. తొలుత శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న తర్వాతే వెనుదిరుగుతానని స్పష్టం చేసిన ఆమె ఆ తర్వాత తన నిర్ణయం నుంచి వెనక్కు తగ్గారు. శుక్రవారం రాత్రికి కొచ్చి నుంచి ముంబై బయలుదేరి వెళ్లారు. తృప్తి దేశాయ్‌ వెనుదిరగడంతో ప్రస్తుతానికి వెనుదిరగడంతో ఆందోళనకర పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. 

Similar News