తగ్గింపు ధరల్లో షావోమీ ఫోన్లు

Update: 2018-12-13 16:14 GMT

మొబైల్ తయారీ సంస్థ షావోమీ గతనెల షావోమీ రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఎ స్మార్ట్‌ఫోన్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రెండింటి ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రెడ్‌మీ 6ఎ అన్ని వేరియంట్ల ధరలను తగ్గించి ఇంతకుముందున్న  ధరలను నిర్ణయించింది. షావోమీ  పోకో ఎఫ్1 స్మార్ట్ ఫోన్ ధరను రూ.1000 తగ్గించింది. ప్రస్తుతం ఈ ధర ఫోన్ రూ.19,999కే అందుబాటులో ఉంది. అలాగే రెడ్‌మీ 6ఎ 2జీబీ ర్యామ్/16జీబీ స్టోరేజీ వేరియంట్‌ ఇప్పుడు రూ.5,999కే అందుబాటులో ఉండగా.. 2జీబీ ర్యామ్/32 జీబీ వేరియంట్ రూ.6,999కే అందుబాటులోకి వచ్చింది. 

Similar News

నేను సైతం!
StoryFour
StoryThree