పార్లమెంట్ లో సేమ్ సీన్

Update: 2018-12-13 11:55 GMT

పార్లమెంట్ లో సేమ్ సీన్ రిపీట్ అయింది. పలుపార్టీ సభ్యల నిరనసనలలో ఉభయ సభలు హోరెత్తాయి. సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్ శుక్రవారానికి వాయిదా పడింది. టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసనతెలిపారు. పార్లమెంట్‌ శీతకాల సమావేశాల్లో మూడోరోజూ ఆందోళనలు కొనసాగాయి. దీంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. టిడిపి, డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఉభయసభల్లో అందోళన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌ సమావేశాలకు ప్రారంభానికి ముందు టిడిపి ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ పార్లమెంట్‌ గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. పార్లమెంటు సమావేశాల్లో విచిత్ర వేషధారణలతో నిరసనను తెలిపే ఎంపీ శివప్రసాద్‌ మరో కొత్త వేషధారణలో పార్లమెంటుకు వచ్చారు. గారడి వేషధారణలో పార్లమెంట్‌ ఆవరణలో నిరసనకు దిగారు.  పొట్టకూటి కోసం మాయలు చేసే వాడు ఒకడైతే.. మోడీ ఓట్లు, పదవుల కోసం మాయలు చేస్తారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంటూ మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని మాయమయ్యారని ఎంపీ శివప్రసాద్‌ విమర్శించారు. 

Similar News