హరికృష్ణ మృతికి కారణాలివి..

Update: 2018-08-29 04:29 GMT

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు హరికృష్ణ (61) మృతి చెందారు.  కారు అదుపుతప్పి బోల్తా పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. అయితే అయన మృతికి కారణాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన హరికృష్ణ కారును తానే డ్రైవ్‌ చేస్తున్నారు.ఈ క్రమంలో అతివేగం కారణంగా హరికృష్ణ కారు అన్నెపర్తి వద్ద అదుపు తప్పి ముందు వాహనాన్ని ఢికొట్టింది. అనంతరం డివైడర్‌ను ఢికొడుతూ..  ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢికొట్టింది. దీంతో హరికృష్ణ కారు గాల్లో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. హరికృష్ణ దాదాపు 30అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు.. దాంతో హరికృష్ణ తల, గుండె భాగానికి బలమైన గాయాలయ్యాయి. అప్పటికే అపస్మారక స్థితిలో పడివున్న ఆయనను స్థానికులు కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స అయన బడి సహకరించకపోవడంతో హరికృష్ణ మృతిచెందారు. 

Similar News