కేసీఆర్ ఏపీకి వస్తే ఆహ్వానిస్తాం‌: ముద్రగడ

Update: 2018-12-12 07:11 GMT

కేసీఆర్ ఏపీకి వస్తే ఆహ్వానిస్తామన్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ  పద్మనాభం. చంద్రబాబుకి గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. కాపు రిజర్వేషన్ల విషయంలో పవన్ తీరు సరిలేదన్న ఆయన తెలంగాణ ప్రజలను భగవంతుడు కాపాడినట్టు చెప్పారు. ఏపీ ప్రజలను కూడా కాపాడాలని ఆశిస్తున్నట్టు ముద్రగడ తెలిపారు. తెలంగాణ ప్రజలకు, కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Similar News