అన్నకు వీర తిలకం దిద్దిన సోదరి కవిత

Update: 2018-12-17 07:52 GMT

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.టీ రామారావు బాధ్యతలు స్వీకరించారు. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం తెలంగాణ భవన్‌లో ఈరోజు ఉదయం 11:56 నిమిషాలకు ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకంటే ముందు ప్రగతి భవన్ లో కుటుంబ సభ్యుల మధ్య అన్న కేటీఆర్ కు సోదరి కవిత వీర తిలకం దిద్ది ఆశీర్వదించారు. పార్టీలో క్రియాశీలకమైన పాత్ర పోషించబోతున్న నా ప్రియమైన సోదరుడికి శుభాకాంక్షలు అని తెలుపుతూ ఎంపీ కవిత ట్వీట్ చేశారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తరుణంలో ప్రగతి భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. 

Similar News