సస్పెన్స్ వీడుతుందిగా! తొందరెందుకు?

Update: 2018-09-02 07:40 GMT

తెలంగాణాలో అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్ళే విషయంపై స్పందించేందుకు నిజామాబాద్ తెరాస ఎంపీ కవిత నిరాకరించారు. దీనిపై తనకు అవగాహన లేదని, తమ నేత కేసీఆర్ ఏం చెబుతారోనని తాము కూడా ఆసక్తితో ఎదురుచూస్తున్నామని ఆమె ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సాయంత్రానికి సస్పెన్స్ వీడుతుందని, తమ నేత కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలు వినడానికి లక్షలాది మంది ప్రజలతో పాటు తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. కొంగర కలాన్ సభ కోసం పూర్తిగా పార్టీ నిదులనే ఖర్చు చేస్తున్నాం. బస్సులకు అద్దె చెల్లించాం. విద్యుత్ శాఖకు 30 లక్షలు కట్టాం అని కవిత స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ విజయం ఖాయం అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
 

Similar News