నిండు కుండలా సాగర్ జలాశయం

Update: 2018-08-20 13:36 GMT

గతకొద్ది కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్ జలకలను సంతరించుకుంది. కృష్ణా బేసిన్ లోకి ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరదనీరు పోటెత్తడంతో సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. ఆల్మట్టి నారాయణపూర్, తుంగభద్రల నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో  వస్తోంది. కాగా వరద ఉదృతి ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగితే నాగార్జున్ సాగర్ జలాశయం పూర్తిగా నిండే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి  నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 194 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Similar News