కోతుల పాలిట ఆపద్బాంధవుడిగా మారిన స్వప్నిల్ సోని...ప్రతీ సోమవారం కోతులకు 1700 రొట్టెలు

Update: 2018-10-27 08:05 GMT

అటవీ ప్రాంతంలో ఏమీ దొరక్క ఆకలి తీర్చుకునేందుకు జనావాసాల్లోకి వచ్చిన కోతులకు అహ్మదాబాద్‌కు చెందిన స్వప్నిల్ సోని ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు. స్వప్నిల్ సోని ప్రతీ సోమవారం పండ్లు, రొట్టెలను కోతులకు ఆహారంగా అందిస్తున్నాడు. స్వప్నిల్ సోని ప్రతీ సోమవారం 1700 రొట్టెలను కోతులకు ఆహారంగా అందిస్తున్నాడు. కోతులకు నేను గత పదేళ్లుగా ఆహారం అందిస్తున్నా. ఆరు నెలల క్రితం నా ఆర్థిక పరిస్థితి క్షీణదశకు చేరుకుంది. అయినా కానీ కోతులకు మాత్రం రొట్టెలు ఇవ్వడం మానలేదు. ప్రస్తుతం ఆర్థికంగా బాగానే ఉన్నా. నా కొడుకు కూడా ఈ పనిలో భాగస్వామ్యమవుతాడని స్వప్నిల్ సోని చెప్పాడు. మూగజీవాల ఆకలి తీర్చుతున్న స్వప్నిల్ సోనికి  స్థానికులు హాట్సాఫ్ చెబుతున్నారు. 

Similar News