మహానగరంలో మాయగాళ్లు! ఈ స్టోరీ చూడండి

Update: 2018-05-07 04:59 GMT

మహా నగరంలో మాయగాళ్లు పెరిగిపోతున్నారు.  ఉద్యోగాల కోసం వస్తున్న నిరుద్యోగులను టార్గెట్ చేసుకుంటూ చెలరేగిపోతున్నారు. ఆర్మీ, ఐటీ అంటూ లక్షల రూపాయల జీతాలను ఆశగా చూపి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.  కన్సల్టెంట్ పేరిట సంస్ధలు ప్రారంభించడం ..అందినకాడికి దోచుకోవడం అలవాటుగా మార్చుకున్నారు కొందరు కేటుగాళ్లు. హైదరాబాద్‌లో తాజాగా వెలుగుచూసిన హైక్ కన్సల్టెంట్ బాగోతం వందలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లింది.

నిరుద్యోగులకు టోకరా పెట్టింది హైదరాబాద్‌లో అత్తాపూర్ కేంద్రంగా సాగుతున్న  హైట్ కన్సల్టెన్సీ.  వేలల్లో జీతం వచ్చే ఆర్మీ ?  లక్షలు ఇచ్చే  ఐటీ కంపెనీల్లో  కొలువా ? ఉద్యోగం ఏదయినా సరే  మమ్మల్సీ  సంప్రదించండంటూ సోషల్ మీడియా ప్రచారం ప్రారంభించింది.  జస్ట్ రెండు లక్షలు ఇస్తే నెల రోజుల్లో అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు వల వేశారు. నమ్మకం కుదిరేందుకు తమలోనే కొందరి మొబైల్ నెంబర్లు ఇచ్చి .. తమకు నిజంగానే ఉద్యోగం వచ్చిదంటూ బాగా నమ్మించారు.  ఇలా డబ్బు కట్టి మోసపోయిన కొందరు  పోలీసులను ఆశ‌్రయించడంతో ఈ ముఠా గుట్టు రట్టైంది.
బైట్: బైట్ :- అంజనీ కుమార్ , సీపీ , హైదరాబాద్  స్టారింగ్ లోనే ఉంది. కంటెంట్‌కు తగినట్టు 15 సెకన్ల లోపు వేయగలరు. వీలైతే 10 చాలు
వాయిస్:  కర్నూలు జిల్లాకు చెందిన   రామాంజినేయులు అలియస్ రామంజి  స్నేహితుడు సయ్యద్  హాశంతో పాటు ఆరు మందితో కలిసి HIKE కన్సల్టెన్సీ  పేరుతో నకిలీ సంస్థను ఏర్పాటు చేశారు. తమ దగ్గరకు వచ్చే వారికి ఒరిజినల్ సర్టిఫికెట్లతో తమ ఆఫీస్ కి రావాలంటూ  ..తమకు తెలిసిన చోటే ఫిజికల్ టెస్ట్, ఫేక్ ఇంటర్యూలు నిర్వహించేవారు.  ఇందుకోసం ప్రత్యేకంగా పోలీస్ డ్రస్‌, ల్యాప్ టాప్‌లు ఏర్పాటు చేసుకుని తతంగం నడిపేవారు. ఇంటర్యూలో వీకంటూ కొందరి దగ్గర..   పరీక్షలు రాయకపోయినా ఆర్మీలోకి పంపుతామంటూ ఆశజూపుతూ ఇంకోదరి  దగ్గర రెండు నుంచి మూడు లక్షల వరకు డిమాండ్ చేసేవారు. డబ్బు ఇచ్చిన వారికి  నెల రోజుల తరువాత జాయిన్ కావాలంటూ  నకిలీ ఆఫర్ లెటర్ పంపడం .. డేట్‌ను రెండు రోజుల ముందు ఫోన్ చేసి  నియమాకాలు రద్దయ్యాయని త్వరలో మళ్లీ ఆఫర్ లెటర్ పంపుతామంటూ మోసం చేసేవారు. ఇలా 30 మంది నిరుద్యోగులను మోసం చేసినట్ట పోలీసులు గుర్తించారు.

వీరికి మీరట్‌కు చెందిన ఆర్మీ ఉద్యోగులు  మహేష్ రాథోర్ , అవదేష్ కుమార్  ఈ ముఠా సభ్యులకు సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులు నుండి ఇండియన్ ఆర్మీ కి చెందిన 6 నకిలీ రబ్బర్ స్టాంప్ లు , నకిలీ ఆర్మీ అపైంట్ మెంట్ ఆర్డర్స్‌ , 31 ఫేక్‌ కాల్ లెటర్స్, 33 ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు,  4 పోలిస్ యూనిఫాం లు 4 , లాప్ టాప్ , కలర్ ప్రింటర్ ను స్వాదీనం చేసుకున్నారు. దీంతో పాటు నకిలీ నోట్ల చెలామణి కూడా చేసినట్టు పోలీసుల దర్యాప్తులో  వెల్లడైంది.  రామాంజినేయులు తో పాటు  సయ్యద్ హశం , రాకేశ్ బాబు , ఇమ్రాన్ అహమ్మద్ తో పాటు మరో ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. దీని వెనక ఇంకా పెద్ద ముఠా ఉందనే అనుమానంతో దర్యాప్తు మరింత లోతుగా జరపాలని నిర్ణయించుకున్నారు.  

 

Similar News