శ్రీ చండీ కుమార అనంత మహాగణపతి రూపంలో.. ఖైరతాబాద్ గణనాథుడు

Update: 2017-12-13 09:46 GMT

నవరాత్రి ఉత్సవాలకు సిద్ధం అవుతున్నాడు ఖైరతాబాద్ గణనాథుడు. 60 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని శిల్పులు అద్భుతంగా రూపొందిస్తున్నారు. వినాయక చవితి దగ్గర పడుతుంటడంతో విగ్రహ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈసారి గణేశుడు ఎలా ఉండబోతున్నాడో  ఓసారి చూద్దాం. 

వినాయక చవితి వస్తుందంటే చాలు అందరి చూపు ఖైరతాబాద్ వైపే. గణనాధుడు ఈసారి ఏ రూపంలో కనువిందు చేస్తాడు? ఎన్ని అడుగుల ఎత్తులో కొలువుదీరుతాడని అంతా ఆతృతగా ఎదురుచూస్తారు. అందరూ ఆశ్చర్యపోయే రీతిలో లంబోదరుడి విగ్రహ పనులు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీ చండీ కుమార అనంత మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు
ఖైరతాబాద్ గణనాధుడు.

 ఒక్క అడుగుతో ప్రారంభమైన గణపతి విగ్రహ ప్రస్థానం 60 అడుగులకు చేరింది. గతేడాది రెండు అడుగులు తగ్గించినా.. భక్తుల కోరిక మేరకు మళ్లీ ఇప్పుడు 60  అడుగుల విగ్రహాన్ని రూపొందించేలా పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. ఈ భారీ విగ్రహాన్ని అందగా తీర్చిదిద్దుతున్నారు శిల్పులు.

 విగ్రహం వెనక నుంచి పై భాగం వరకు పచ్చని చెట్లతో పాటు కుడివైపు కుమార స్వామి .. ఎడమ వైపు దుర్గామాత విగ్రహాలు గణపతితో పాటు కొలువుతీరనున్నాయి. 5 పడగల పాము ఆకారంలో వినాయక విగ్రహం ఉంటుందని శిల్పి రాజేంద్రన్‌ అంటన్నారు. సుమారు 150 మంది శిల్పులు నాలుగు నెలలుగా గణపతి విగ్రహ తయారీలో పాలుపంచుకుంటున్నారు.   
మహాగణపతి కోసం ఈసారి తాపేశ్వరం లడ్డూను ప్రసాదంగా పెట్టనున్నారు నిర్వాహాకులు.

Similar News