వచ్చే ఏడాది భారత్‌ ధగధగలు

Update: 2017-12-27 07:12 GMT

కొత్త సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ అదరగొట్టనుంది. దశాబ్దాలుగా అగ్రస్థానంలో ఉన్న పశ్చిమ దేశాలు బ్రిటన్‌, ఫ్రాన్స్‌ భారత్‌ ముందు ఇక బలాదూర్‌. సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసెర్చ్‌ నివేదిక ప్రకారం ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ స్థానం సంపాదించనుంది. సెబర్ కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదిక  ప్రకారం బ్రిటన్, ఫ్రాన్స్, ఆర్ధిక వ్యవస్ధలను భారత్ ఓవర్ టేక్  చేసి గొప్ప శక్తిగా అవతరించబోతోందని తెలుస్తుంది.  డాలర్ పరంగానూ 2018 ఇండియాకు బాగా కలిసి వస్తుందని అంచనా వేసింది.

రాబోయో 15 సంవత్సరాల వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆసియా దేశాలే టాప్‌ 10లో ఉండనున్నాయని సెబర్‌ డిప్యూటీ ఛైర్మన్‌ డాగ్లస్‌ మెక్‌ విలియమ్స్‌ ప్రకటించారు. భారత్‌లో పెద్దనోట్ల రద్దు, GST లాంటి భారీ ఆర్థిక సంస్కరణలు అమలవుతున్నందు వల్ల.. తాత్కాలికంగా ఆర్థిక పురోగతి నెమ్మదించిందని తెలిపారు. త్వరలోనే మళ్లీ పుంజుకుంటుందని.. మిగతా దేశాలను ఆర్థిక శక్తిలో వెనక్కి నెడుతుందని నివేదికలో ప్రకటించారు. 2032 నాటికి అమెరికాను అధిగమించి ఆర్థిక వ్యవస్థలో చైనా అగ్రస్థానంలో నిలుస్తుందని సెబర్‌ నివేదిక వెల్లడించింది.
 

Similar News