కేశవనగర్‌లో కూల్చివేతలు.. పోలీసులపై రాళ్లదాడి

Update: 2018-07-31 06:51 GMT

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కేశవ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెల్లవారుజామన కాలనీకి చేరుకున్న  GHMC సిబ్బంది ..ఎలాంటి ప్రకటన చేయకుండానే అక్రమ కట్టడాలను కూల్చి వేయడం ప్రారంభించారు. అధికారుల తీరును నిరసిస్తూ స్ధానికులు అందోళనకు దిగారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తమ ఇళ్లను ఎలా కూలుస్తారంటూ అధికారులను నిలదీశారు. గత 30 ఏళ్లుగా నివాసముంటన్న తమను ఎలా ఖాళీ చేయిస్తారంటూ  ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు స్ధానికులను మద్దతుగా ఆందోళనకు దిగారు. GHMC యంత్రాలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు . కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడి ఎస్ ఐ నయీముద్దీన్ కు గాయాలు అయ్యాయి. 

Similar News