అది పరిష్కారం కాకుంటే ఉద్యమానికి దిగుతా : పవన్

Update: 2017-12-12 09:32 GMT

ఫాతిమా కాలేజ్‌ యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్థులు అనుభవించడం కరెక్ట్‌ కాదన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. విద్యార్థులను రీలొకేట్‌ చేయడానికి సమస్యేంటో అర్థం కావడం లేదని... అసలు విద్యార్ధులు చేసిన తప్పేంటో చెప్పాలంటూ ప్రశ్నించారు. సమస్య పరిష్కారం ఢిల్లీలోనే ఉందంటే.. ఢిల్లీనే ఇక్కడి లాక్కొద్దామన్న పవన్‌... వారం రోజులు సమయం ఇవ్వండి.. దీనిపై నేను మాట్లాడుతానన్నారు. మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే భయపడకండీ.. మీ వెనక జనసేన ఉందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవద్దని.. ఫాతిమా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకుంటే... వారితో కలిసి తాను కూడా ఉద్యమానికి దిగుతానాని హెచ్చరించారు. కనీసం ఫాతిమా కాలేజీ విద్యార్థుల చూపిన తెగువ...రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షం చూపించి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేదన్నారు. ప్రత్యేక హోదా ఎలాగో వదిలేసారు కనీసం ఫాతిమా కాలేజ్‌  విధ్యార్థులకైనా న్యాయం చెయ్యండని పవన్ సూచించారు..

Similar News