అమ్మవారి అదృశ్యం వెనుక అసలు కోణం

Update: 2017-12-13 09:58 GMT

బాసర సరస్వతి అమ్మవారి ఉత్సవ విగ్రహం తరలింపు.. మరో కీలక మలుపు తిరిగింది. విగ్రహన్ని తరలించిన ఇద్దరు పూజారులతో మరో ఇద్దరు పూజారులకు సంబంధం ఉందని తేలింది. అయినా ఆ ఇద్దరు పూజారులపై కేసు నమోదు కాలేదు. కేసు నుంచి ఆ పూజారులను ఎందుకు తప్పిస్తున్నారు.?

 చదువలమ్మ అదృశ్యం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు పూజారులపై బాసర పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయ్. అయితే అమ్మవారి ఉత్సవ విగ్రహం దేవరకొండ తీసుకెళ్లి.. పూజలు నిర్వహించిన వారిలో మరో ఇద్దరు పూజారులున్నారు. అందులో ఒకరు గాయత్రి దేవాలయ పూజారివిశ్వజిత్ కాగా మరొకరు ఆర్య వైశ్య సత్రంలో ఉండే కృష్ణ. అయితే వీళ్ల ఇద్దరిపై ఆలయ అధికారులు కేసు ఫైల్‌ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. 

అమ్మవారి ఉత్సవ విగ్రహం తరలింపులో వీరి పాత్ర ఉందన్నది కచ్చితం. కానీ వీళ్లను తప్పించడానికి ఫిర్యాదు చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్. అయితే ఉత్సవ విగ్రహం తరలింపుతో సంబంధం ఉన్న వారందరిపై చర్యలు తప్పవంటున్నారు ఈవో. అమ్మవారి ఆలయం నుంచి అత్యంత పవిత్రంగా, అమ్మవారి ప్రతిరూపంగా భావించే ఉత్సవ విగ్రహం తీసుకెళ్లినప్పుడు ఆలయ ఇన్‌స్పెక్టర్‌కు, సూపరింటెండెంట్‌కు తెలుసంటున్నారు పూజారులు. అయినా వాళ్ల మీద చర్యలు తీసుకోలేదు. కాసులకు కక్కుర్తి పడి ఇలాంటి దందాలకు పాల్పడుతున్న ఆలయ అధికారులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తన్నారు. 

Similar News