పవిత్ర యాదాద్రిలో అపవిత్ర కార్యకలాపాలు... యాదాద్రి చీకటి కథలు

Update: 2018-08-22 11:05 GMT

పవిత్రతకు మారుపేరయినా యాదగిరిగుట్టలో అసలేం జరుగుతోంది ? ఏళ్ల తరబడి అసాంఘిక శక్తులు రాజ్యమేలడానికి కారణాలు ఏంటి ? పసిపిల్లలను సైతం ఈ వృత్తిలోకి దింపడానికి కారణం ఏంటి ? భక్తులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ అంసాఘిక కార్యకలాపాలకు అండగా నిలుస్తున్నదెవరు ? పోలీసుల దాడుల తరువాత యాదగిరిగుట్టలో ప్రస్తుతం పరిస్దితులు ఎలా ఉన్నాయి. 

అన్యాయాన్ని చీల్చి చెండాడిన నరసింహాస్వామి సన్నిధి  అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పట్టుమని పదేళ్లు కూడా లేని చిన్నారులకు వ్యభిచార కూపాలే నివాసాలుగా మారుతున్నాయి. అన్యం పుణ్యం ఎరుగని ఎంతో మంది చిన్నారుల జీవితాలు హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా ఉక్కు పాదాల కింద నలిగిపోతున్నాయి. యాదగిరిగుట్టలో  HMTV ప్రతినిధి బృందం నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి.   

వ్యభిచార ముఠాలు పొరుగు ప్రాంతాల నుంచి బాలికలను అపహరించి ఇక్కడకు తీసుకొస్తున్న మాట నిజమేనంటూ అంగీకరిస్తున్న పాత ముఠాల సభ్యులు ఇందులో తమ పాత్ర లేదంటున్నారు. పేదరికం సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే వ్యభిచార కూపంలోకి దిగాల్సి వస్తోందంటూ పలువురు కన్నీరు పెట్టుకుంటున్నారు. తమకు తగిన అవకాశాలు లభిస్తే గౌరవంగా బ్రతుకుతామంటూ చెబుతున్నారు .

Similar News