నాన బెట్టిన ఖర్జూరం తింటే ఉపయోగాలెన్నో

Update: 2018-09-19 14:47 GMT

నాన బెట్టిన ఖర్జూరం తింటే ఎన్నో ఉపయోగాలున్నాయంటున్నారు కొందరు నిపుణులు.  రోజు రెండు, లేక మూడు ఖర్జూర పండ్లను నీటిలో రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే ఈ గుజ్జుని రెండు స్పూన్లు పిల్లలకు తినిపిస్తే కడుపు ఉబ్బరం తగ్గి విరేచనం సాఫీగా అవుతుంది. అలాగే  మలబద్దకంతో బాధ పడే పెద్దవారికి సైతం ఇది బాగా పనిచేస్తుంది.  ఖర్జూర పండులో ఉండే ఇనుము, కాల్షియం శరీరానికి మేలు చేస్తుంది. నానబెట్టిన ఖర్జూర పండు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్యమెంటో చూడండి.. 

*  ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
*  ఇంకా ఈ పండులో విటమిన్ బి5 ఎక్కువగా ఉండడం వలన చర్యానికి మేలు జరుగుతుంది.
*  జుట్టు రాలే సమస్యలను తగ్గిస్తుంది.
 *పెద్ద పేగు సమస్యలు తొలగిపోతాయి.
*  దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వలన రక్త హీనత సమస్యలు నివారించబడతాయి.
*  బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
 

Similar News