టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి ఓ మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు

Update: 2018-09-10 13:38 GMT

ఎన్నికలకు అతికొద్ది సమయం మాత్రమే ఉండగా.. కాంగ్రెస్‌లో చేరేందుకు టీఆర్ఎస్‌ అసమ్మతి నేతలు క్యూ కడుతున్నారు. రాజ్యసభ సభ్యుడి తోపాటు ఇద్దరు ఎమ్మెల్సీల చేరికకు రంగం సిద్ధమైంది. బుధవారం గాంధీ భవన్‌లో ఆజాద్‌, ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో డీఎస్, కొండా సురేఖ, కొండా మురళి, భూపతిరెడ్డి చేరనున్నారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, ఆకుల రాజేందర్‌ తదితరులు చేరే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా టీఆర్ఎస్ లో ఎంపీ డి. శ్రీనివాస్ కు చేదు అన్హుభావం ఎదురవడంతో అయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఈ విషయంపై డీఎస్ కాంగ్రెస్ పెద్దలను సంప్రదించారు. ఇక ఆయనతోపాటు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కూడా  కాంగ్రెస్ లో చేరనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న కొండా సురేఖ, మురళిలు సైతం టీఆర్ఎస్ ను వీడుతున్నారు. ఇప్పటికే తమకు అసెంబ్లీ టికెట్ కేటాయించకపోవడాన్ని ఫ్యామిలీ తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. దాంతో ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ అధినాయకత్వంపై దుమ్మెత్తిపోశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈనెల 23 వరకు ఆగుదామని చూసినా.. కాంగ్రెస్ నేతల ఒత్తిడి కారణంగా ఎల్లుండి కొండా సురేఖ, మురళి లు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు.

Similar News