తెలంగాణకు కేంద్రం శుభవార్త

Update: 2017-12-18 12:20 GMT

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తుది దశ పర్యావరణ అనుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించింది. ఇప్పటికే శరవేగంగా కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు.. పర్యావరణ అనుమతులు రావడంతో మరింత వేగవంతం కానున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రధాన అనుమతులైన అటవీశాఖ, పర్యావరణ శాఖ అనుమతులు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తోంది.


 

Similar News