పవన్‌ పోటీచేసినా నేనే గెలుస్తా

Update: 2018-07-03 10:56 GMT

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన నియోజకవర్గం నుంచి పోటీ చేసినా సరే, తానే గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘జనసేనాని పవన్‌ ఏలూరు నుంచి పోటీ చేసినా ఫర్వాలేదు. ఖచ్ఛితంగా నేనే గెలుస్తా. టీడీపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పవన్‌ తన విలువ కోల్పోతున్నారు’ అని బుజ్జి కామెంట్లు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. కాగా, ఏలూరులో ఎస్వీఆర్ శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఎస్వీఆర్ కు బడేటి బుజ్జి బంధువు అవుతారు. బుజ్జి ఆధ్వర్యంలోనే ఈ వేడుకలు జరిగాయి.

Similar News