తెలంగాణలో ఎలక్షన్ బెల్.. 24 గంటల్లో రైల్వే స్టేషన్‌, బస్‌స్టేషన్‌

Update: 2018-10-07 02:03 GMT

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్నీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్వయంగా తెలియజేశారు. అధికారిక వాహనాల వినియోగంపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను రేపటిలోగా నిలిపివేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు, బ్యానర్లు తీసేయాలన్నారు. ఎలక్షన్ల ఫిర్యాదుల కోసం ప్రతి కలెక్టరేట్ లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 

అలాగే 24 గంటల్లో రైల్వే స్టేషన్‌, బస్‌స్టేషన్‌, విమానాశ్రయాల్లో బ్యానర్లు, కరపత్రాలు 
అన్నింటిని తొలగించాలని ఆదేశించారు. ప్రచార కరపత్రాలను ఇంటి యజమాని అనుమతితోనే అతికించాలని సూచించారు. ఒకవేళ ఆలా కాకుంటే వారిపై తమకు ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ప్రచారంపై నిషేధం ఉంటుందని గుర్తు చేశారు. కేవలం నిర్ధేశిత సమయంలో మాత్రమే ప్రచారం చేసుకోవాలని స్పష్టం చేశారు. 

Similar News