తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం

Update: 2018-12-05 11:32 GMT

తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. ఇక రాష్ట్రంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఒపీనియన్‌ పోల్స్‌, సర్వేలపై నిషేధం అమలల్లోకి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే, రెండేళ్లు జైలుశిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉంది. తెలంగాణలోని మావోయిస్టు ప్రభావిత, సమస్యాత్మక ప్రాంతాల్లో గంట ముందే ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసింది. సిర్పూర్‌, బెల్లంపల్లి, చెన్నూర్‌, మంచిర్యాల, అసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగుతో పాటు.. పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో ప్రచార పర్వం ముగిసింది. ప్రచారానికి గడువు ముగిసిన తర్వాత కూడా.. నిబంధనలు ఉల్లంఘిస్తే, రెండేళ్లు జైలుశిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉంది. 
 

Similar News