తెలంగాణలో నవంబర్ లోపే ఎన్నికలు?

Update: 2018-09-09 02:20 GMT

తొమ్మిది నెలల ముందుగానే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ లోపే ఎన్నికలు ఉంటాయని చెప్పగా.. ఈ ఏడాది నవంబర్‌లోనే రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. నవంబర్‌లోనే ఎన్నికలు జరిపేలా ఓటర్ల జాబితాను సవరించింది. సాధారణ షెడ్యూల్‌ కంటే మూణ్నెల్ల ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఈనెల 10న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేసి.. దానిపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత అక్టోబర్‌ 8న తుది జాబితా ప్రకటించనున్నట్టు సమాచారం. 

Similar News