కుమారస్వామి సంచలన నిర్ణయం... మోదీ బాటలో...!

Update: 2018-06-02 06:06 GMT

అధికారిక సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎవరూ ఫోన్లను వినియోగించరాదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆదేశాలు జారీ చేశారు. మీటింగ్ లు జరుగున్నప్పుడు కొందరు అధికారులు ఫోన్లను చూస్తున్నారని... దీనివల్ల చర్చలకు ఇబ్బంది కలుగుతోందని ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు. తాను ఎప్పుడు సమావేశాలకు పిలిచినా... అధికారులు ఫోన్లను తీసుకురాకూడదని తెలిపారు. సమావేశం ముగిసేంత వరకు ఫోన్లను కోఆర్డినేషన్ అధికారికి అప్పగించాలని చెప్పారు. ప్రధాని మోదీ కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేశారు. తన సమావేశాలకు అధికారులెవరూ ఫోన్లను తీసుకురావద్దని చెప్పారు. మోదీ ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకే కుమారస్వామి కూడా మొబైల్ ఫోన్లపై నిషేధం విధించడం గమనార్హం. 
 

Similar News