తెగిన కాలునే దిండుగా పెట్టారు…

Update: 2018-03-12 06:07 GMT

ఆయనో డాక్టర్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సంయమనం కోల్పోకుండా వైద్యం అందించాలి. తన పరిమితుల్లో రోగికి ఉన్నతమైన సేవలు అందించాలి. బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడాలి. కానీ.. వైద్య వృత్తికే అవమానం కలిగేలా ఉత్తరప్రదేశ్ లోని ఓ డాక్టర్ ప్రవర్తించాడు. చివరికి.. విధుల నుంచి సస్పెండ్ అయ్యాడు.

యూపీలోని ఝాన్సీలో ఓ వాహన క్లీనర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని దగ్గర్లోని.. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టరు.. ఆ క్లీనర్ కు చికిత్స చేశాడు. ప్రమాదం తీవ్రంగా ఉండడంతో కాలును కూడా తొలగించాడు. చివరికి ఆ తొలగించిన కాలునే.. ఆ రోగికి తలగడలా పెట్టేశాడు.

ఈ విషయంపై.. బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఫిర్యాదు చేయడంతో.. వైద్యం చేసిన ఆ డాక్టర్ ను కాలేజీ నిర్వాహకులు విధుల నుంచి తప్పించారు. నలుగురు సభ్యుల కమిటీని వేసి విచారణకు ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా.. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదికకు ఆదేశించింది.

Similar News