కరెంట్ ఛార్జీలు పెంచం : మంత్రి జగదీశ్‌రెడ్డి

Update: 2018-03-24 08:50 GMT

కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా  24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సబ్‌స్టేషన్ల నిర్మాణం వేగవంతం చేస్తామన్నారు. అన్ని గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామాల్లో లో ఓల్టేజీ సమస్య వస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఒక సబ్‌స్టేషన్ కింద 20 గ్రామాలు ఉన్నప్పుడు సమస్యలు వస్తాయన్నారు. ప్రతీ గ్రామానికి సబ్‌స్టేషన్‌ను నిర్మించడం సాధ్యం కాదన్నారు. అన్ని గ్రామాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని స్పష్టం చేశారు. శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నామని తెలిపారు. లూజ్ లైన్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా, లైన్ల నిర్వహణ సరిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు.

Similar News