అక్రమ అరెస్టులతో కాంగ్రెస్‌ ప్రభంజనాన్ని అడ్డుకోలేరు: రాహుల్

Update: 2018-12-04 12:05 GMT

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో స్పందించారు. అక్రమ అరెస్టులతో కాంగ్రెస్‌ ప్రభంజనాన్నిఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే రేవంత్‌ను అరెస్ట్‌ చేశారని  రాహుల్‌ మండిపడ్డారు. కేసీఆర్‌ నిరంకుశ ధోరణికి పరాకాష్టే ఈ అరెస్టు అని ట్విట్‌ చేశారు. టీఆర్ఎస్‌ ప్రజా వ్యతిరేక పాలనకు రోజులు దగ్గరపడ్డాయని రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో రాబోయేది ప్రజకూటమియే అని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.

Similar News