వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తెరపైకి రేవంత్ రెడ్డి పేరు

Update: 2018-06-22 08:27 GMT

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు హాట్‌హాట్‌గా మారాయి. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అధినేత రాహుల్ గాంధీ కొత్త ఫార్ముల తెరపైకి తెచ్చారు. ఇందుకోసం తన విదేశీ పర్యటనను సైతం రద్దు చేసుకున్న ఆయన సామాజిక వర్గాల వారిగా కసరత్తులు  ప్రారంభించారు. ఇప్పటికే ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్ ఫార్ములాను సిద్ధం చేసిన ఆయన ఇందుకోసం సమర్ధవంతమైన నేతలను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఇదే సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీంతో పాటు ఇప్పటి వరకు సీఎల్పీ నేతగా ఉన్న జానారెడ్డి స్ధానంలో మల్లు భట్టి విక్రమార్కను నియమించారనే ప్రచారం జరుగుతోంది.  జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించి .. పార్టీ ఇన్‌చార్జ్‌గా పొరుగు రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రిని నియమించాలని రాహుల్ భావిస్తున్నారు. మరో సీనియర్ నేత వీహెచ్‌కు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

Similar News