కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్‌

Update: 2018-09-21 10:55 GMT

టీ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీలు రేపిన చిచ్చు మరో మలుపు తిరిగింది. కుంతియాతో పాటు ఇతర నేతలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా స్పందించింది. నల్గొండ జిల్లాలో జరిగిన ఓ సభలో కాంగ్రెస్ కమిటీలపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వేసిన కమిటీలన్నీ బ్రోకర్లతో నిండిపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు. వార్డు మెంబర్స్‌గా కూడా గెలవలేనోళ్లను కమిటీలో వేశారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కుంతియా రాష్ట్ర కాంగ్రెస్‌కు పట్టిన పెద్ద శని అంటూ ధ్వజమెత్తారు. కమిటీల ఏర్పాటుపై తాను ఫోన్‌లో కుంతియాను నిలదీశానన్నారు. పని చేసేవాళ్లను పట్టించుకోకపోవడం వల్లే కాంగ్రెస్‌కు ఈ గతి పట్టిందని వ్యాఖ్యానించారు. పైరవీకారులకు టిక్కెట్లు ఇస్తే పార్టీకే నష్టమని రాజగోపాల్‌రెడ్డి హితవు పలికారు. రాజగోపాల్‌రెడ్డి ఆరోపణలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది.      

Similar News