అందుకే వాళ్లను నగరం నుంచి బహిష్కరించాం: కేసీఆర్‌

Update: 2018-07-16 06:35 GMT

హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను, ఆయనకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైన ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసులు నగరం నుంచి బహిష్కరించిన సంగతి విదితమే. వీరిద్దరి బహిష్కరణను ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థించుకున్నారు. ఆదివారం గవర్నర్ నరసంహన్‌తో భేటీ అయిన కేసీఆర్ వారిద్దరిపై వేటుకు గల కారణాలను వివరించారు. శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. వారిపై వేటు వేయడానికి అదే కారణమన్నారు.

ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌.నరసింహన్‌ను కలిసి,  ప్రస్తుత రాజకీయ, పాలనాపరమైన అంశాలపై ఆయన చర్చించారు. రైతులకు రూ.5లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించేందుకు ఆగస్టు 15న ప్రారంభించనున్న రైతు బీమా పథకం ఉద్దేశాలు, వివరాలను గవర్నర్‌కు సీఎం తెలియజేశారు. వర్షాల రాకతో ఎగువ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వరద ప్రవాహం ప్రారంభమైందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. వచ్చే సెప్టెంబర్‌ నుంచి సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామన్నారు.


 

Similar News