కాసేపట్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన?

Update: 2018-09-06 08:37 GMT

తెలంగాణ కేబినెట్ కధ ముగిసింది. అసెంబ్లీని రద్దు చేస్తూ కేబినెట్ క్యాబినెట్ ఏకవాక్య తీర్మానం చేసింది. అనంతరం  సీఎం కేసీఆర్ మంత్రులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. కేబినెట్ భేటి అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి అనంతరం గన్ పార్కుకు వెళ్లి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి ప్రగతిభవన్ కు వెళతారు. అక్కడే మీడియాలో మాట్లాడనున్నారు. అసెంబ్లీ రద్దు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన వివరించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో అభ్యర్ధుల పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈక్రమంలో జూబిలీహిల్స్ ఎమ్మెల్యేకు సీటు లేదంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో మన్నే గోవర్ధన్ రెడ్డికి టికెట్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా కొందరు ఎమ్మెల్యేల్ని ప్రగతి భవన్‌కు పిలిపించిన కేసీఆర్ వారితో టికెట్లపై స్పష్టత ఇచ్చారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖను పిలిపించిన సీఎం భూపాలపల్లి నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని చెప్పారు. అలాగే చొప్పదండి ఎమ్మెల్యే బోడిగా శోభకు టికెట్ ఇవ్వమోదంటూ కొందరు కార్యకర్తలు సీఎం కేసీఆర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆమె స్థానంలో కొండా సురేఖ కుమార్తెకు టికెట్ ఇవ్వాలని వారు కోరుతున్నట్టు సమాచారం. 

Similar News