గ్రేటర్‌ పరిధిలో మూడోరోజు చంద్రబాబు పర్యటన

Update: 2018-12-03 06:11 GMT

ఏపీ సీఎం చంద్రబాబు కూడా వరుసగా మూడో రోజు ప్రచారం చేపట్టనున్నారు. ఇవాళ గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలా 30 నిముషాలకు గగన్‌మహల్‌ సాగర్‌ వ్యూ దగ్గర చంద్రబాబు ఇవాళ్టి రోడ్‌ షో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఇందిరాపార్క్‌, భోలక్‌పూర్‌, రాంనగర్‌ క్రాస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో రోడ్‌ షో నిర్వహిస్తారు. అలాగే ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో బంజారాహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 12, ఎన్‌ బీ టీ నగర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్‌ షోతో పాటు.. సభలు కూడా నిర్వహిస్తారు. 

సాయంత్రం చంద్రబాబు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కలిసి హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలా 30 నిముషాలకు రహమత్‌నగర్, శ్రీరాం నగర్‌లో 6 గంటలా 30 నిముషాలకు గ్రీన్హిల్స్‌ రోడ్‌, మూసాపేట్‌ హైటెక్ సిటీ మెయిన్‌రోడ్‌‌ తదితర ప్రాంతాల్లో ఇద్దరు నాయకులు రోడ్‌ షో నిర్వహిస్తారు. ఆయా చోట్ల ప్రసంగిస్తారు. 

Similar News