శివవైష్ణవులు ఒకేచోట కొలువైన ఆలయం..చిదంబరం

Update: 2017-09-16 16:19 GMT

తమిళనాడులోనిది చిదంబరం. తమిళ‌నాడు అంటేనే దేవాలయాలకు పెట్టింది పేరు. అందులోనూ చిదంబర ఆలయానికి ఉన్న పేరు ప్రఖ్యాతులు అంతా ఇంతా కాదు. తమిళ‌నాడులోని ద్రావిడ రీతుల్లో నిర్మించిన దేవాలయాల్లో చిదంబరం ఒక మణిపూస ఇది సముద్ర తీరానికి 11 కి. మి. దూరంలో మరియు చెన్నైకు దక్షిణంగా 250 కి. మి. దూరంలో కలదు. శివుడు తాండవం చేసిన ప్రదేశం .. ఆ తాండవ నృత్యాన్ని చూసి విష్ణుమూర్తి పులకించి పోయిన ప్రదేశం ... తమిళ నాడులోని చిదంబరం. తమిళనాడులో శివాలయాలకు కొదువ లేదు. దీనికి కారణం అప్పటి పాండ్య, చోళ రాజులే. వారికి శివుని మీద ఎంత భక్తి ఉందో అక్కడి దేవాలయాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆ ఆలయాలలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది నటరాజ ఆలయం..చిదంబర ఆలయం. ఇది పంచభూత క్షేత్రాలలో ఒకటైన చిదంబరంలో కలదు 1.భూమి - కాంచీపురం, 2.గాలి - శ్రీకాళహస్తి, 3. నీరు- ట్రిచీ, 4. అగ్ని - తిరువణ్ణామలై, 5. ఆకాశం - చిదంబరం. ఇవీ పంచ భూత క్షేత్రాలు. 

1. ఐదు సభలు లేక వేదికలు చిత్సబై - గర్భ గుడి కనకసబై - నిత్య పూజలు జరిగే వేదిక నాట్య సబై లేదా నృత్య సబై - శివుడు కాళితో నాట్యమాడిన ప్రదేశం రాజ్యసబై - భగవంతుని ఆధిపత్యాన్ని చాటి చెప్పిన సభ దేవసబై - పంచమూర్తులు కొలువైన సభ చిత్ర కృప.   తిరుమూల తనేశ్వరర్, పార్వతి ఆలయం, శివగామి ఆలయం, గణేష్ ఆలయం, పాండియ నాయకం ఆలయం, గోవింద రాజ పెరుమాళ్ ఆలయం, పుండరీగవల్లి తాయార్ ఆలయాలతో పాటు చిదంబర ఆలయ ప్రాంగణంలో ఇంకా చిన్న చిన్న ఆలయాలు అనేకం ఉన్నాయి. 

ఈ ఆలయ రహస్యాలు.. చిదంబర ఆలయం, కాళహస్తి ఆలయం, కంచి లోని ఏకాంబరేశ్వరుని ఆలయం ఒకే రేఖాంశం మీద ఉన్నాయి. ఈ మూడు ఆలయాలు 71 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం మీద కనిపిస్తాయి . ఇది ఆశ్చర్యం కాదూ ...!  చిదంబర ఆలయం - ప్రతికాత్మకత, చిత్స బై మీద ఉన్న 9 కలశాలు - 9 శక్తులను, కప్పు పై ఉన్న 64 అడ్డ దూలాలు - 64 కళలను, అర్ధ మండపంలోని 6 స్తంభాలు - 6 శాస్త్రాలను , పక్కనున్న మరో మండపంలోని 18 స్థంబాలు - 18 పురాణాలను, కనక సభ నుండి చిత్ సభకు దారితీయు 5 మెట్లు - 5 అక్షరాల పంచాక్షర మంత్రం ను (నమః శివాయ), చిత్ సభపై కప్పుకు ఊతమిచ్చే నాలుగు స్తంభాలను - నాలుగు వేదాలకు ప్రతీకలుగా, గర్భ గుడిలోని 28 స్తంభాలు - 28 శైవ ఆగమాలను సూచిస్తుంది.

చిదంబరంను ఎలా చేరుకోవాలి ?
సమీప విమానాశ్రయం - చెన్నై (250 కి. మీ) రైలు మార్గం చిదంబరంలో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇది తిరుచ్చి - చెన్నై మార్గంలో కలదు. చెన్నై నుండి ఇక్కడికి ప్రతి రోజూ రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు మార్గం చెన్నై - పాండిచ్చేరి మార్గంలో చిదంబరం కలదు. ప్రైవేట్, ప్రభుత్వ బస్సులు తరచూ ఈ మార్గం గుండా వెళుతుంటాయి.

Similar News