స్వభావమే ప్రధానం

Update: 2018-01-18 09:44 GMT

రామబాణం దెబ్బ రుచి చూసినవాడిగా చెబుతున్నా - సీతాపహరణ ఆలోచన  మానుకో అని మారీచుడు జరగబోయేపరిణామాలతోపాటు రావణుడికి చెప్పాడు. రావణుడు వినలేదు. సీతమ్మ మందలించింది . వినలేదు. హనుమ హెచ్చరించాడు. వినలేదు. విభీషణుడు సవరించబోయాడు. వినలేదు. మండోదరి మధనపడింది. వినలేదు. పంచభూతాలు బిక్కుబిక్కుమన్నాయి.  అష్టదిక్పాలకులు చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయారు.  మద్యం - మగువల మత్తులో తూలిపోయాడు. చివరకు పోయాడు. 

నాకు మంచి తెలుసు - కానీ చేయాలనిపించదు . నాకు చెడు తెలుసు - కానీ చేయకుండా ఉండలేను . స్వభావో దురతిక్రమః - నా స్వభావం ఇంతే . నేను మారను . మారాలని అనుకోవడంలేదు - అన్నాడు రావణుడు.


మనమెలా ఉన్నామో రామాయణం అద్దంలో ఒకసారి చూసుకోవచ్చు . లేదా ప్రతి క్షణం , ప్రతి సందర్భంలో చూసుకోవచ్చు .
 

Similar News