బస్సు నుంచి పడిపోయిన కండక్టర్

Update: 2018-08-14 08:52 GMT

ఓ కండక్టర్ ప్రమాదవశాత్తూ బస్సు నుంచి పడిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఘటన హైదరాబాద్‌లో జరిగింది. వేవ్ రాక్ జంక్షన్ దగ్గర సీటీ బస్సు యూటర్న్ తీసుకొంటుండగా అందులో ఉన్న కండక్టర్ ప్రమాదవశాత్తు వెనక డోర్ నుంచి కిందపడిపోయాడు. బస్సు వేగంగా మలుపు తిరుగుతుండగా వెనక డోర్ దగ్గర నిల్చొని ఉన్న కండక్టర్ గడ్డం రాములు అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఇది గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును ఆపి కండక్టర్‌ ఆస్పత్రికి తరలించారు. బస్సు నుంచి కింద పడిపోయిన కండక్టర్ గడ్డం రాములుకు 
తీవ్రగాయాలయ్యాయి. ఈ నెల 12న వేవ్ రాక్ కూడలి దగ్గర జరిగిన ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News