నేడు బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె

Update: 2018-12-26 05:14 GMT

దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు మరో సారి సమ్మె బాట పట్టారు. ఆరు రోజుల వ్యవధిలో రెండో సారి సమ్మెకు దిగారు.  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయ, దేనా బ్యాంకుల విలీన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిరసన బాట పట్టాయి.  ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వరంగ బ్యాంకు సేవలు పూర్థి  స్ధాయిలో స్తంభించనున్నాయి. అయితే ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. వరుస సెలవుల నేపధ్యంలో ఈ అంశంపై  బ్యాంకులు తమ ఖాతాదార్లకు సమ్మె సమాచారాన్ని  తెలియజేశాయి.

తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలతో కూడిన యునైటెడ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ సమ్మెలో పాల్గొంది. ప్రభుత్వ బ్యాంకుల విలీన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు వివిధ రూపాల్లో తమ ఆందోళన కొనసాగుతందని యూనియన్ నేతలు ప్రకటించారు. ప్రభుత్వరంగ బ్యాంకులు అన్నింటినీ కలిపి ఒక్కటి చేసినా  ప్రపంచంలోని టాప్‌ 10లో చోటు దక్కదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. 

Similar News