4లక్షల 93వేల బోగస్ ఓట్లు తొలగింపు: రజత్ కుమార్

Update: 2018-12-04 05:44 GMT

లంగాణ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామన్నారు ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్. 4లక్షల 93వేల బోగస్ ఓట్లు తొలగించామని చెప్పారు. నెలరోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేశామని వివరించారు. న్యాయపరమైన సమస్యలను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నామన్న ఆయన ఎన్నికల నిర్వహణ ఒక సవాల్‌ లాంటిదన్నారు.  7వ తేదీన జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు.  4లక్షల 93వేల బోగస్ ఓట్లు,  2లక్షలకు పైగా డబుల్ పేర్లు ఓట్లు,  3లక్షలకు పైగా చనిపోయిన వారి ఓట్లు తొలగించామని మీట్ ది ప్రెస్ లో తెలిపారు. 

119 అసెంబ్లీ స్థానాలకు 1,821 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు రజత్ కుమార్ పేర్కొన్నారు. అత్యధికంగా మల్కాజ్ గిరిలో 42 మంది, అతి తక్కువ మంది బాన్సువాడలో ఆరుగురు బరిలో ఉన్నట్లు ఈసీవో చెప్పారు. ఎన్నికల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రానికి చెందిన 30వేల మంది పోలీసు సిబ్బంది , ఇతర రాష్ట్రాల నుంచి 18వేల మంది సిబ్బంది ఎన్నికల్లో విధుల్లో ఉన్నారని తెలిపారు. 240  కంపెనీల కేంద్ర పోలీసు బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయని మరో 39 కంపెనీలు పోలింగ్ ప్రారంభమయ్యే నాటికి రాష్ట్రానికి రానున్నట్లు వెల్లడించారు. పోటీ చేసే అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను సేకరించామని పార్టీ మేనిఫెస్టోలు, హామీలను పరిశీలిస్తున్నామన్నారు రజత్ కుమార్. 

Similar News