గతంలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించానని చెబుతూ, 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని ట్వీట్ చేసిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ గుర్తుందా? ఇప్పుడామెతో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ లంచ్ డేట్ లో కనిపించి చిన్న సైజు కొత్త చర్చకు తెరలేపాడు. శ్రీలంకతో అండర్-19 యూత్ టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే బ్యాటింగ్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ మళ్లీ ఇంగ్లండ్‌కు చేరుకున్నాడు. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్‌తో కలసి అర్జున్ లంచ్ చేస్తూ కనిపించాడు.
ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి మధ్య ఉన్న స్నేహం ఎంతవరకూ వెళ్లిందోనంటూ గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.