సల్మాన్‌ఖాన్ సోదరుడు, నిర్మాత అర్బాజ్‌ఖాన్ ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించాడు. మహారాష్ట్ర థానె పోలీసుల ఎదుట విచారణకు హాజరైన అర్బాజ్‌ఖాన్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. గత ఆరేళ్ల నుంచి బుకీ సోను, అర్బాన్ ఖాన్ ఒకరికొకరు తెలుసని పోలీసుల విచారణలో తేలింది. సోను, అర్బాజ్ మధ్య జరిగిన చాటింగ్ సమాచారం, బుకీలతో కలిసి వీరిద్దరు దిగిన ఫోటోలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఐపీఎల్ బెట్టింగ్ పెట్టి 2.8కోట్లు నష్టపోయినట్లు అర్బాజ్ ఖాన్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.
విచారణలో సోను జలాన్ అర్బాజ్‌ఖాన్ పేరును బయటపెట్టాడు. బెట్టింగ్‌లో 2.8కోట్లు కోల్పోయాడని, ఇవ్వకపోవడంతో బెదిరించానని సోను పోలీసుల విచారణలో తెలిపాడు. బుకింగ్‌కు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై మే 15న జలాన్‌తో పాటు మరో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు.
జలాన్‌ను అరెస్టు చేసిన అనంతరం పోలీసులు బెట్టింగ్ స్థావరంతో పాటు డైరీని స్వాధీనం చేసుకున్నారు. 100కు పైగా బుకీల ఫోన్ నంబర్లు ఆ డైరీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అర్బాజ్ ఖాన్‌తో పాటు ఎంతో మంది కాంట్రాక్టర్లు, బిల్డర్లకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు చెప్పారు. సోను పలువురు బడాబాబుల పేర్లను కూడా ఈ విచారణలో బయట పెట్టినట్లు థానె పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఆ పేర్లు ఎవరివి అనేది మాత్రం బయటకు రావడం లేదు.