భర్త చేతిలో నటి దారుణహత్య

Update: 2018-08-09 04:33 GMT

రోజురోజుకు మహిళా ఆర్టిస్టులపై దారుణాలు పెరిగిపోతున్నాయి. భర్త చేతిలో నటి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన పాకిస్తాన్‌లో జరిగింది. పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ నటి రేష్మ  మొదట్లో సీరియల్ నటిగా జీవితాన్ని ప్రారంభించి. అనంతరం సినిమాల్లో నటిగా నిలదొక్కుకుంది.   అంతేకాదు గాయనిగానూ రేష్మకు మంచి పేరుంది. నాలుగేళ్ల, కిందట ఆమెకు వివాహం జరిగింది.   ఇదివరకే రేష్మ భర్త మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతను వ్యాపారంలో నష్టాలు చవిచూశాడు. దాంతో భార్యను డబ్బులు కావాలని వేధించడం మొదలుపెట్టాడు. అతని ప్రవర్తనకు విసుగు చెందిన రేష్మ   గత కొన్నిరోజులుగా నౌషెరా కలాన్‌ లోని హకిమాబాద్‌లోని తన సోదరుడి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ప్లాన్‌ ప్రకారం అక్కడికి వచ్చిన రేష్మ భర్త ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోగా, అతడు అక్కడినుండి పరారయ్యాడు. అనంతరం నటి రేష్మ తీవ్ర రక్తస్రావంతో మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Similar News