పురుషుడికి కనీసం 40 మిలియన్ల వీర్య కణాలుండాలట..

Update: 2018-09-19 14:59 GMT

మహిళలు గర్బం దాల్చాలంటే పురుషుడు కనీసం 40 మిలియన్ స్పెర్మ్స్ విడుదల చేయాల్సి ఉంటుందని ఆధ్యనాలు చెబుతున్నాయి. స్పెర్మ్ కౌంట్ 20 మిలియన్ల కన్నా అధికంగా ఉన్నప్పుడు దానిని నార్మల్ కౌంట్‌గానే పరిగణిస్తారు వైద్యులు. కానీ స్పెర్మ్ కౌంట్ విపరీతంగా తగ్గితే పిల్లలు పుట్టే ఆవకాశం ఉండకపోవచ్చు అని అంటున్నారు. స్పెర్మ్ కౌంట్ తగ్గటానికి ప్రధాన కారణాలు మద్యం తాగడం, పొగత్రాగడం అలాగే నిద్ర తక్కువగా పోవడం వంటివి.. ముఖ్యంగా మద్యం మరియు పొగత్రాగడం వలన మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గే ఆవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొగాకు, గుట్కాల్లోని నికోటిన్ వీర్య కణాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ఆలస్యంగా పడుకోవడం ఆలస్యంగా నిద్రలేవడం వలన శరీరంలో అనేక మార్పులు వస్తాయని.. మగవారిలో రెస్ట్ లేకపోవడం వలన వీర్య కణాల వృద్ధి తగ్గే అవకాశముందని.. నిపుణులు చెబుతున్నారు.

Similar News